గుజరాత్ లో దారుణం: మూఢనమ్మకాలొద్దు అంటూ పదేళ్ల కొడుకును హతమార్చిన తండ్రి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: గుజరాత్

గుజరాత్ రాష్ట్రం సానంద్ నగర సమీపంలోని వించియా గ్రామంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఒక తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబం తరఫున వస్తున్న పూజారి సంప్రదాయాన్ని తన కొడుకు కొనసాగించకూడదనే ఉద్దేశంతో పదేళ్ల కుమారుడు కరణ్ను తండ్రి నరేష్ దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో తల్లి పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ ఘోరం జరిగిందని, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు.