విజయవాడ వెస్ట్ బైపాస్ ఘోరం: కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయవాడ

విజయవాడ వెస్ట్ బైపాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈవీ కారు దగ్ధం కావడంతో నలుగురు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు. నంబూరులోని ఫంక్షన్కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. మృతులను కొమ్మారెడ్డి రాందేవ్, కొమ్మారెడ్డి అరుణ, ఒక చిన్నారి మరియు తిగురు విజయగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.