గణేశ్ ఘాట్ పనులను పరిశీలించిన తెదేపా నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నెల్లూరు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గణేశ్ ఘాట్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పార్టీలకతీతంగా ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ తదితరులు పాల్గొన్నారు.