జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు... మూడేళ్లలో 95 మంది మృతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని ఎన్‌హెచ్‌ 26పై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గత మూడేళ్లలో 116 ప్రమాదాల్లో 95 మంది మృతి చెందగా 182 మంది క్షతగాత్రులయ్యారు. కూడళ్ల వద్ద ఆక్రమణలు, సరైన లైటింగ్‌ లేకపోవడం, భారీ వాహనాల నిలిపివేత ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అధికారులు స్పందించి తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.