విమానంలో ప్రయాణికుడి వీరంగం: డోర్ తెరిచేందుకు యత్నించడంతో కలకలం
రిపోర్టర్: నరేష్
స్థలం: శంషాబాద్
శంషాబాద్ నుండి కడప వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలో డోర్ తెరిచేందుకు ప్రయత్నించి వీరంగం సృష్టించాడని ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో విమానంలోని ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని, సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకుని తమకు అప్పగించారని వెల్లడించారు. ప్రయాణికుడు కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడా లేదా మానసిక సమస్యలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.