పుణేలో దారుణం: అదనపు కట్నం వేధింపులతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

రిపోర్టర్: సతీష్ స్థలం: Pune

పూణే ముకుంద్ నగర్ లో అదనపు కట్నం వేధింపులు భరించలేక పాయల్ జాంబ్రే పాటిల్ అనే ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె మేనమామ వెల్లడించారు. ప్రతి దీపావళికి పది తులాల బంగారం తేవాలని అత్తమామలు వేధించారని, కరువు కారణంగా ఈసారి ఇవ్వలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు భర్తను అరెస్టు చేసి నలుగురిపై కేసు నమోదు చేశారు.