యువత దేశానికే సంపద అంటూ అవంతి కళాశాలలో విద్యార్థులకు మార్గదర్శనం

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా మకవరపాలెంలోని అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నూతన విద్యార్థుల పరిచయ వేదిక మరియు ర్యాగింగ్ నిరోధక అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, విశ్వవిద్యాలయ నిపుణులు, ప్రముఖ సాఫ్ట్వేర్ నిపుణులు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు సాంకేతికత వినియోగం, వ్యక్తిగత నైపుణ్యాలపై అమూల్యమైన సలహాలు అందించారు.