అమెరికా టెక్ సంస్థలకు భారీ షాక్: శాశ్వత లేబర్ సర్టిఫికేషన్లు సస్పెండ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమెరికా
అంతర్జాతీయంగా పేరొందిన ఎనిమిది ఐటీ కంపెనీల శాశ్వత కార్మిక సర్టిఫికేషన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, క్యాప్‌జెమినీ, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, అడోబ్ సంస్థలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. హెచ్-1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం నేపథ్యంలోనే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆయా కంపెనీల ఉద్యోగులు గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం కుదరదని అధికారులు పేర్కొన్నారు.