గూడూరులో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

రిపోర్టర్: కిరణ్ స్థలం: గూడూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పాల్గొని విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్గాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.