ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ఎన్నిక

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ఎన్నికయ్యారని ఎన్నికల నిర్వాహకులు తెలిపారు. ఆదివారం జరిగిన ఎఫ్ఎన్సీసీ ఎన్నికల్లో మొత్తం 2799 మంది ఓటర్లు ఉండగా 1585 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదిశేషగిరిరావు ప్యానెల్ తరపున పోటీచేసిన మోహన్ ముళ్లపూడి కార్యదర్శిగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అధ్యక్షుడిగా కేఎస్ రామారావు మినహా మిగిలిన ఆయన ప్యానెల్ అభ్యర్థులు ఓటమిపాలవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.