నెల్లూరు జిల్లాలో భారీ షిప్‌యార్డ్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఒప్పందం
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో అత్యాధునిక హంగులతో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు సమక్షంలో మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌తో కూటమి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు రూ. 15,000 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏటా 12 లక్షల టన్నుల భారీ నౌకల నిర్మాణ సామర్థ్యంతో పాటు సమగ్ర పోర్ట్ క్లస్టర్ అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నౌకా నిర్మాణ హబ్‌గా అవతరించనుంది.