వైకాపాకు షాక్.. తెదేపాలో చేరిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీను
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
స్థానిక ఎన్నికల వేళ ఉత్తరాంధ్రలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేసిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అనుచరులతో కలిసి తెదేపాలో చేరారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.