భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నదుల్లో ప్రవాహాలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించాలని, వర్ష ప్రభావం ఉండే జిల్లాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఆహారం, వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.