చింతపల్లిలో ఆపరేషన్ త్రిశూల్: మహిళల భద్రతపై పోలీసుల భారీ అవగాహన ర్యాలీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి షాండీలో ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సీఐ మరియు ఎస్ఐ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులు, గ్రామస్థులతో కలిసి పోలీసులు సోమవారం ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు ఆల్లూరి పోలీస్ శాఖ వెల్లడించింది. మహిళల రక్షణ, భద్రతా చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.