ఏపీలో భారీ పెట్టుబడులకు ఎస్‌ఐపీసీ గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: అశోక్
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్‌లో రూ.22,351 కోట్ల భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీసీ ఆమోదం తెలిపింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో రూ.2,700 కోట్లతో క్వాంటమ్ హార్డ్‌వేర్ తయారీ కేంద్రం ఏర్పాటుకు సృష్టి క్వాంటమ్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 15,816 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది. సౌర విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లోనూ పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాయి.