రాష్ట్రాల అవతరణ దినోత్సవం: ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూఢిల్లీ

మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హరియాణా రాష్ట్రాల అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా వేర్వేరు సందేశాలు వెలువరించారు. దేశాభివృద్ధిలో ఆయా రాష్ట్రాల ప్రజలు అందిస్తున్న సేవలు అసాధారణమని కొనియాడారు. రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక సందర్భాన ప్రజలందరి జీవితాల్ లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన మనసారా ఆకాంక్షించారు.