ఘోర ప్రమాదం: స్కై డైవింగ్ చేస్తూ పారాచూట్లు ఢీకొని ఇద్దరు మృతి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: California

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన స్కై డైవింగ్ ప్రమాదంలో ఇద్దరు అనుభవజ్ఞులైన స్కైడైవర్లు ప్రాణాలు కోల్పోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. లేక్ ఎల్సినోర్లో గాల్లో ఎగిరిన వారి పారాచూట్లు ల్యాండింగ్ సమయంలో ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై నిర్వాహక సంస్థ స్పందిస్తూ పరికరాల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని స్పష్టం చేసింది.