జేఎన్టీయూకే క్రిమినల్‌ కేసును సివిల్‌ వివాదంగా మార్చిన వైనం

రిపోర్టర్: కృష్ణ స్థలం: కాకినాడ

కాకినాడ జేఎన్టీయూకేకు గ్లోబరీనా సంస్థ వల్ల రూ.26.62 కోట్ల నష్టం వాటిల్లిందన్న క్రిమినల్‌ కేసును పోలీసులు సివిల్‌ వివాదంగా మార్చడం కలకలం రేపింది. నాటి వర్సిటీ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో సమగ్ర దర్యాప్తు చేయకుండానే ముగించేయడానికి ప్రయత్నాలు జరగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.