డిజిటల్ వ్యసనం: పిల్లలపై తల్లిదండ్రుల మొబైల్ వాడకం తీవ్ర ప్రభావం

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమెరికా

పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు వాడటం వల్ల వారి మధ్య అనుబంధం దెబ్బతింటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అమెరికాకు చెందిన పరిశోధకులు 600 మంది కౌమార దశ పిల్లలపై ఈ సర్వే నిర్వహించారు. ఫోన్ల వాడకం వల్ల పిల్లల్ లో ఆందోళన, అభద్రతా భావం పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. పెద్దలు తమ డిజిటల్ అలవాట్లను మార్చుకోవాలని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది.