టెక్సాస్లో ఘనంగా టాంటెక్స్ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల వాక్ రన్

రిపోర్టర్: సునీల్ స్థలం: Frisco, Texas

అమెరికాలోని టెక్సాస్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల వాక్ రన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్య అవగాహన, సీపీఆర్ శిక్షణతో పాటు కమ్యూనిటీ సేవా స్ఫూర్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకలో నూట యాభై మందికి పైగా కమ్యూనిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్ సంస్థకు వేయి డాలర్ల విరాళాన్ని అందజేసినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.