కెనడాకు ఈయూ అసోసియేట్‌ సభ్యత్వంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మద్దతు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఫ్రాన్స్

అమెరికా కెనడా మధ్య మారుతున్న సంబంధాల వేళ కెనడాకు యూరోపియన్ యూనియన్ లో అసోసియేట్ సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పూర్తి మద్దతు తెలిపారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో జరిగిన సమావేశంలో ఇరు దేశాలు రక్షణ, ఇంధనం, అంతరిక్షం, కీలక ఖనిజాలు వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి.