వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎస్సైలు, స్టేషన్ రైటర్లకు ప్రత్యేక శిక్షణ పూర్తి
రిపోర్టర్: రమేష్
స్థలం: హన్మకొండ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్సైలు, స్టేషన్ రైటర్లకు నిర్వహించిన 12 రోజుల ప్రత్యేక శిక్షణ ముగిసిందని వరంగల్ పోలీసులు వెల్లడించారు. కేసుల దర్యాప్తు తీరు, కోర్టు విధానాలపై పోలీసు సిబ్బందికి వృత్తిగత నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని అక్టోబర్ 22న ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక శిక్షణా తరగతులు అధికారుల విధుల్ లో మరింత సామర్థ్యాన్ని పెంచుతాయని అధికారులు స్పష్టం చేశారు.