విజయవాడలో నేరాల కట్టడికి ఏఐ డ్రోన్ల నిఘా

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయవాడ

విజయవాడ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల కట్టడి కోసం పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే మాట్రిస్ 4టీ డ్రోన్లను ఉపయోగిస్తూ హాట్ స్పాట్లు, నగర శివారు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత నిఘా ఏర్పాటు చేశారు. మహిళల రక్షణతో పాటు బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఈ డ్రోన్ల ద్వారా గుర్తిస్తున్నట్లు వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు వెల్లడించారు.