ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో లీజు భవనాల్లోనే మెజారిటీ డిగ్రీ కళాశాలలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో 90 శాతానికి పైగా సంస్థలు సొంత భవనాలు లేకుండా లీజు ప్రాంగణాల్లోనే కొనసాగుతున్నట్లు వర్సిటీ యంత్రాంగం గుర్తించింది. నిబంధనల ప్రకారం సొసైటీ పేరిట సొంత స్థలాలు, భవనాలు ఉండాల్సి ఉండగా, దశాబ్దాలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో సీజేఎస్ అధ్యక్షుడు డాక్టర్ మాసారం ప్రేమ్‌కుమార్ స్పందిస్తూ, నకిలీ డాక్యుమెంట్లు సమర్పించిన కళాశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.