వైభవంగా సాగిన కాణిపాకం విమాన వాహన సేవ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఐరాల
చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు విమాన వాహన సేవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక సేవలో భాగంగా గణనాథుడు పురవీధుల గుండా విహరిస్తూ భక్తులకు కనువిందుగా దర్శనమిచ్చారు. ఈ దివ్య వేడుకను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.