అనుంపల్లి లో ఘనంగా వినాయక చవితి సంబరాలు

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలోని అనుంపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలం పాటలో పసుపులేటి వెంకటరమణ 86 వేలకు లడ్డును దక్కించుకున్నారు. గ్రామస్తులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో ప్రసాదం స్వీకరించారు.