ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ ప్రయాణికుల తీవ్ర నిరసన
రిపోర్టర్: రమేష్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీ విమానాశ్రయంలో దుబాయ్ వెళ్లాల్సిన రెండు స్పైస్‌జెట్ విమానాలు పదేపదే ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర నిరసన తెలిపారు. సుమారు 200 మంది ప్రయాణికులు టెర్మినల్-3 వద్ద ఆందోళనకు దిగారు. విమానం గ్రౌండ్ కావడం, సాంకేతిక కారణాల వల్లే జాప్యం జరిగినట్లు ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.