అమెరికాపై ఇరాన్ తీవ్ర హెచ్చరిక: మరో యుద్ధం వస్తే కొమ్ములు విరుస్తామంటూ ఫైర్
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
అమెరికా మరో యుద్ధానికి దిగితే ఆ దేశం కొమ్ములు విరుస్తామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహ్సెన్ రెజాయ్ హెచ్చరించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పంపిన లేఖలో స్వరం పూర్తిగా మారిందని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో తమ సైనిక సన్నద్ధతను చాటుతూ, అమెరికా యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకుని క్షిపణుల పరీక్షలు నిర్వహించినట్లు మొహ్సెన్ రెజాయ్ వెల్లడించారు.