భారీ వర్షాల బీభత్సం: ఉమ్మడి జిల్లాల్ లో నలుగురు మృతి, గల్లంతైన ముగ్గురు
రిపోర్టర్: శివ
స్థలం: ప్రకాశం
ఉమ్మడి ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలపై తీవ్ర తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. ఈ భీకర వర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్ లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంత్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈదురుగాలులకు వేలాది వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు యంత్రాగం స్పష్టం చేసింది.