నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటకుల కోసం జంగిల్ సఫారీ పునఃప్రారంభం

రిపోర్టర్: రాజేష్ స్థలం: నల్లమల

నల్లమల అటవీ ప్రాంతంలో మూడు నెలల విరామం తర్వాత పర్యాటకుల సందర్శనార్థం జంగిల్ సఫారీ సేవలు గురువారం అధికారికంగా పునఃప్రారంభమైనట్లు అటవీ అధికారులు వెల్లడించారు. పులుల సంతానోత్పత్తి కాలం ముగియడంతో జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ నిబంధనల మేరకు తాత్కాలికంగా నిలిపివేసిన సేవలను నేటి నుండి యథావిధిగా రన్ చేయనున్నారు. బైర్లూటి ఎకో టూరిజం కేంద్రంతో పాటు పచ్చర్ల, తుమ్మలబయలు, రోళ్లపాడు సఫారీ కేంద్రాల్లో పర్యాటకులకు అనుమతి కల్పించామని, ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.