యువతలో తీవ్ర నిరాశ: ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారంటూ నిపుణుల సంచలన ప్రకటన
రిపోర్టర్: వెంకట్
స్థలం: Bengaluru
దేశంలోని యువత తీవ్ర నిరాశలో కూరుకుపోవడానికి ఉద్యోగ అవకాశాలు కరువవడం, విపరీతమైన ద్రవ్యోల్బణం, కృత్రిమ మేధ ప్రభావమే కారణమని బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త రోహన్ మయ్య స్పష్టం చేశారు. ఏయోస్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు అయిన ఆయన సామాజిక మాధ్య వేదిక ద్వారా ఈ ఆందోళనకర అంశాలను వెల్లడించారు. దేశంలో ప్రతిఏటా లక్షలాది మంది పట్టభద్రులు బయటకు వస్తున్నప్పటికీ, తగినన్ని ఉపాధి అవకాశాలు లభించక యువత తీవ్ర మానసిక ఆందోళన ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.