ముంబై ఆపిల్ స్టోర్ వద్ద ఐఫోన్ 18 ప్రో విక్రయాలు ప్రారంభం

రిపోర్టర్: గోపి స్థలం: ముంబై

భారతదేశంలో ఐఫోన్ 18 ప్రో మరియు ఐఫోన్ 18 ప్రో మాక్స్ అధికారిక విక్రయాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ ఆపిల్ స్టోర్ బయట భారీగా జనం గుమిగూడారు. నాసిక్ నుండి వచ్చిన హితేష్ పటేల్ సహా పలువురు వినియోగదారులు రాత్రి నుంచే క్యూలో వేచి ఉండి కొత్త ఫోన్లను కొనుగోలు చేశారు. స్టోర్ వద్ద జనసమూహాన్ని క్రమబద్ధీకరించేందుకు ఆపిల్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.