మంత్రి నాదెండ్ల మనోహర్ ని కలిసిన జనసేన నాయకుడు సురేంద్రదేవ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, మంత్రి నాదెండ్ల మనోహర్ ని సురేంద్రదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గంలో పార్టీని మరింత బలపరచడంపై వారు చర్చించారు. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఆయన నుంచి తగిన సూచనలు, సలహాలు తీసుకున్నారు. జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా సురేంద్రదేవ్ స్పష్టం చేశారు.