పారిశ్రామిక ప్రమాదాలకు చెక్: ముందస్తు హెచ్చరిక పరికరాన్ని రూపొందించిన యువ ఇంజినీర్లు
రిపోర్టర్: సతీష్
స్థలం: విశాఖపట్నం
పరిశ్రమలలో తరచుగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు చక్కా మోహన రావు తన స్నేహితులతో కలిసి సెన్స్ మైండ్స్ 360 ఐవోటీ గేట్వే పరికరాన్ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరికరం గ్యాస్ లీకేజీలు, ఉష్ణోగ్రతల పెరుగుదలను ముందుగానే పసిగట్టి వాట్సప్ ద్వారా క్షణాల వ్యవధిలో హెచ్చరికలు పంపుతుందని వెల్లడించారు. పారిశ్రామిక రంగానికి వరంగా మారిన ఈ ఆవిష్కరణకు ఇప్పటికే ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ద్వితీయ స్థానం దక్కిందని పేర్కొన్నారు.