గుజరాత్‌లో 700 కిలోల కల్తీ రెడ్ చట్నీ పట్టివేత

రిపోర్టర్: అశోక్ స్థలం: గుజరాత్

గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో 700 కిలోల కల్తీ రెడ్ చట్నీని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాస్‌లు, కెచప్‌ల తయారీలో నాణ్యత లేని రసాయనాలు, సింథటిక్ రంగులు వాడుతున్నట్లు గుర్తించారు. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో దొరికే ప్యాక్డ్ ఫుడ్స్ కొనేటప్పుడు లేబుల్స్ జాగ్రత్తగా పరిశీలించాలని, వీలైనంత వరకు ఇంట్లోనే తాజా పదార్థాలతో చట్నీలు తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు.