కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ గ్లాడియేటర్స్ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: తమిళనాడు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మోటార్ రేసింగ్ నేపథ్యంతో తెరకెక్కిన స్పెషల్ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, షాలిని అజిత్ కుమార్ నిర్మిస్తున్నారు. రేసింగ్ ట్రాక్‌పై అజిత్ పడిన కష్టం, సవాళ్లు మరియు విజయాలను కళ్లకు కట్టేలా రూపొందించిన ఈ ట్రైలర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది.