కొమ్మాం భీమ్ ఆసిఫాబాద్లో కానిస్టేబుల్ వైద్య ఖర్చులు భరిస్తామని ప్రకటించిన కేటీఆర్

రిపోర్టర్: అశోక్ స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ వైద్య ఖర్చులు మొత్తం భరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కేటీఆర్ మానవతా దృక్పథం భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించబోయే సంక్షేమానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. ప్రతి ప్రాణం విలువైనదేనని పేర్కొంటూ, సాధారణ పోలీసుల ఇబ్బట్లపై ప్రభుత్వం దృష్టి సారించాలని నేతలు డిమాండ్ చేశారు.