మస్కట్ తీరంలో అరుదైన గులాబీ రంగు డాల్ఫిన్: వైరల్ అవుతున్న వీడియో

రిపోర్టర్: నరేష్ స్థలం: Muscat

ఒమన్ దేశంలోని మస్కట్ తీర ప్రాంతంలో అరుదైన గులాబీ రంగు డాల్ఫిన్ ప్రత్యక్షమైనట్లు స్థానిక నిపుణులు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వేగంగా వైరల్ కావడంతో సముద్ర జీవ శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది అమెజాన్ నదికి చెందిన డాల్ఫిన్ కాదని, ఇండో-పసిఫిక్ హంప్బ్యాక్ జాతికి చెందిన సముద్ర జీవి కావచ్చని పరిశోధకులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వయసు పైబడటం వల్ల లేదా చర్మం రంగు మారడం వల్ల ఇలా గులాబీ రంగులోకి మారి ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.