ఢిల్లీలో అరుదైన వైద్య వింత.. యువకుడిలో గర్భాశయం గుర్తింపు!
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత అరుదైన వైద్య ఘటన వెలుగుచూసింది. సంతానలేమి సమస్యతో ఆస్పత్రిని ఆశ్రయించిన 26 ఏళ్ల యువకుడికి పరీక్షలు నిర్వహించగా, అతనికి లోపల గర్భాశయం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇలాంటి కేసులు 300 లోపే నమోదయ్యాయి. పీఎండీఎస్ జన్యుపరమైన సమస్య కారణంగా ఈ వింత ఏర్పడినట్లు వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించారు.