గాజువాకలో ప్రభుత్వ భూముల కబ్జా.. బడా బాబుల దందా!

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

గాజువాక పెదగంట్యాడ న్యూ దిబ్బపాలెం నిర్వాసిత కాలనీలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. యాతపాలెం లేఅవుట్కు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలను కొందరు వ్యక్తులు దొంగ పట్టాలు సృష్టించి ఆక్రమించి, లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ భూ ఆక్రమణలపై కలెక్టర్, ఎమ్మార్వో, జోనల్ కమిషనర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డిలకు కూడా విన్నవించామని, అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.