గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: మేడ్చల్
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. చెంగిచెర్ల బేబీ పాండ్, పీర్జాదిగూడ పెద్ద చెరువులను సందర్శించి భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ ఏ.శైలజ, మున్సిపల్ ఇంజినీర్లు రాకేష్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.