ప్రభుపాదుల వారి ఆవిర్భావ వేడుకలో 4,311 రకాల నైవేద్యాలు

రిపోర్టర్: హరి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో హరేకృష్ణ మూవ్‌మెంట్‌ వ్యవస్థాపకుడు శ్రీభక్తివేదాంతస్వామి ప్రభుపాదుల వారి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు తమ ఇళ్లలో సాత్విక పద్ధతిలో తయారుచేసిన 4,311 రకాల వంటకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఈ మహా నైవేద్య ప్రసాదాన్ని భక్తులకు భారీ ఎత్తున పంపిణీ చేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందారు.