అక్టోబర్ రెండున ప్రపంచవ్యాప్తంగా సందీప్ కిషన్ సిగ్మా విడుదల

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

సందీప్ కిషన్ హీరోగా, జేసన్ సంజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ సిగ్మా సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఐదు వందల కోట్ల భారీ డ్రగ్స్ మరియు గ్యాంబ్లింగ్ రాకెట్ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథతో పాటు హీరో హీరోయిన్లు సందీప్ కిషన్, ఫారియా అబ్దుల్లా నటన మరియు ఎస్ థమన్ నేపథ్య సంగీతంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.