మొదటిసారి కుమారుడి ముఖాన్ని పరిచయం చేసిన వరుణ్ తేజ్ దంపతులు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడు వాయువ్ తేజ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా తొలిసారి బాబు ముఖాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అద్భుతమైన కుటుంబ ఫోటోలను పంచుకున్నారు. తాను చూడకముందే అతనితో ప్రేమలో పడ్డానని, తండ్రి బాధ్యత అత్యంత అద్భుతమైన భాగమంటూ వరుణ్ తేజ్ భావోద్వేగంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.