అంతర్జాతీయ ఫుట్బాల్కు వీడ్కోలుపై కీలక ప్రకటన చేసిన క్రిస్టియానో రొనాల్డో

రిపోర్టర్: సునీల్ స్థలం: లిస్బన్

ప్రపంచకప్ తర్వాత పోర్చుగల్ జాతీయ జట్టుకు వీడ్కోలు పలకాలని తీవ్రంగా ఆలోచించినట్లు స్టార్ ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో స్పష్టం చేశారు. అయితే జట్టుకు తాను ఇంకా అందించాల్సింది ఎంతో ఉందని భావించి ఆటను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. టోర్నీ అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని, మైదానంలో జట్టు విజయాల కోసం తన వంతు సహకారం అందిస్తూనే ఉంటానని రొనాల్డో వెల్లడించారు.