కారేపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం పశువుల సంతకు వేలం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కారేపల్లి

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం పశువుల సంత నిర్వహణ లైసెన్స్ కోసం నవంబర్ 5వ తేదీన ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఆసక్తి గల టెండర్ దారులు నవంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు షెడ్యూల్ పొందాలని ఆలయ అధికారులు తెలిపారు. ఈ వేలంలో పాల్గొనేందుకు అర్హులైన వారు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.