మెగా హీరో వరుణ్తేజ్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

కొరియన్ కనకరాజు విజయం తర్వాత మెగా హీరో వరుణ్తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యదువంశీ దర్శకత్వంలో వరుణ్తేజ్ ప్రస్తుతం బరి అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా షూటింగ్లో తగిలిన గాయం కారణంగా ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విశ్రాంతి సమయంలోనే ఆయ్ సినిమా దర్శకుడు అంజి చెప్పిన కథకు వరుణ్తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.