ఆవు కోల్పోయిన పాడి రైతుకు అండగా నిలిచిన యాజమాన్యం
రిపోర్టర్: I am Farmer 🍅🌱
స్థలం: అచ్యుతాపురం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం మడుతూరు గ్రామానికి చెందిన పాడి రైతు నూను అప్పారావు ఆవు అకస్మాత్తుగా మృతి చెందింది. ఈ విషయాన్ని గమనించిన హెరిటేజ్ డైయిరి మేనేజర్ కూండ్రపు శేషు స్పందించి బాధితునికి రూ.70 వేల ఆర్థిక పరిహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాడి రైతులకు కృత్రిమ గర్భధారణ రూ.50కే, ఆడ దూడ కోసం రూ.500కే రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో రైతు మృతి చెందితే రూ.2 లక్షల పరిహారం ఇస్తామని, ఏడాదికి రెండుసార్లు బోనస్ అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పాల సంఘం అధ్యక్షుడు శనివాడ ఆనందరావుతో పాటు పలువురు పాడి రైతులు పాల్గొన్నారు.