రైల్వే స్టేషన్లో కత్తితో వీరంగం సృష్టించిన రౌడీషీటర్ బహిష్కరణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నవీ ముంబై
నవీ ముంబై నెరల్ రైల్వే స్టేషన్ పరిధిలో గత నెలలో కత్తితో వీరంగం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అంజాద్ అబ్దుల్ షేక్ అనే అపరాధిని రెండేళ్ల పాటు నవీ ముంబై ప్రాంతం నుండి బహిష్కరించినట్లు వాషి జీఆర్పీ సీనియర్ ఇన్స్పెక్టర్ కిరణ్ ఉంద్రె తెలిపారు. పలు దొంగతనాలు, నేరాలకు పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటూ పోలీసులు అతన్ని అమరావతి జిల్లా సరిహద్దులకు తరలించి కఠిన హెచ్చరికలు జారీ చేశారు.