నర్సీపట్నం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న అయ్యన్న
రిపోర్టర్: రాజేష్
స్థలం: అనకాపల్లి
నర్సీపట్నం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. వీఎంఆర్‌డీఏ ద్వారా అదనంగా రూ.25 కోట్ల నిధులతో నర్సీపట్నం మున్సిపాలిటీలో కీలక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.